మంత్రి నారాయణ కీలక సమావేశం

AP: సీఆర్డీఏ కార్యాలయంలో ఐకానిక్ భవనాల డిజైన్లపై మంత్రి నారాయణ సమీక్షించారు. ఐకానిక్ భవనాల డిజైన్లను ఖరారు చేసేందుకు ఆర్కిటెక్చర్ సంస్థలతో మంత్రి చర్చలు జరిపారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల, ఐదు ఐకానిక్ టవర్ల తుది డిజైన్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భవనాల ప్రణాళికలను ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు మంత్రికి, సంబంధిత అధికారులకు సమగ్రంగా వివరించారు.