VIDEO: తేలప్రోలు వద్ద ప్రమాదం.. పలువురికి గాయాలు

కృష్ణా: ఉంగుటూరు మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం తేలప్రోలులోని చెన్నై కోల్‌కత్తా జాతీయ రహదారిపై ఏలూరు నుంచి పెద్ద అవుటపల్లి వెళుతున్న ఆటోని వెనుక నుంచి కారు వచ్చి ఢీకొంది. దీంతో ఆటో ఉన్న ప్రయాణికులకు పలువురికి స్వల్ప గాయాలు కాగా, ఇద్దరు చిన్నారులకు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.