నరసాపురం దుకాణాల్లో మున్సిపల్ సిబ్బంది తనిఖీలు
W.G: నరసాపురం మున్సిపాలిటీలో నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మంగళవారం మున్సిపల్ ప్లాస్టిక్ బ్యాన్ ప్రత్యేక బృందం పట్టణంలోని పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో భారీగా నిషేధిత ప్లాస్టిక్ నిల్వలను గుర్తించి, వాటిని వెంటనే సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులకు రూ.10 వేల అపరాధ రుసుము విధించారు.