కోటి కంటే ఎక్కువ సంతకాలే వచ్చాయి: సజ్జల
AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చినట్లు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కోటి కన్నా ఎక్కువ సంతకాలు వచ్చాయన్నారు. ఈ ప్రతులను ఈనెల 10న కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. అలాగే, 17న జగన్ సహా ముఖ్య నేతలు గవర్నర్‌ను కలుస్తారని చెప్పారు.