VIDEO: టికెట్ల కోసం బారులు దీరిన భక్తులు
VSP: సింహాచలం చందనోత్సవం ఆఫ్‌లైన్ టికెట్లు బ్యాంకుల వద్ద అందుబాటులో ఉంటాయని దేవస్థానం ఈఓ వెంకటరావు ప్రకటించిన నేపథ్యంలో, మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు బ్యాంకుల వద్దకు పోటెత్తారు. ముఖ్యంగా సింహాచలంలోని యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల వద్ద టికెట్ల కోసం భక్తులు భారీగా బారులు తీరారు.