VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. కార్ బోల్తా

VZM: బొబ్బిలి పట్టణంలోని ఫ్లైఓవర్‌పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిలో ఇందిరమ్మ కాలనీకి చెందిన సంతోష్, గున్నతోటవలసకు చెందిన వంశీ ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో ఫ్లైఓవర్ మీదుగా సంతోష్, వంశీలు రెండు వేర్వేరు బైక్‌పై ఎదురుగా వస్తుండగా వస్తున్న కారును తప్పించబోయి కిందపడ్డారు. కారు కూడా అదుపు తప్పి బోల్తాపడింది.