రీ-సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్

రీ-సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్

KRNL: నందవరం మండలం ముగతి గ్రామంలో రీ-సర్వే పైలట్ ప్రాజెక్ట్‌గా 2వ విభాగంలో ఎన్నికయింది. ఈ సందర్భంగా రీ సర్వేకి సంబంధించిన ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం పరిశీలించారు. భూముల రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.