VIDEO: కన్నుల పండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి

CTR: పుంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపై గీతామందిరంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వేడుకలు జరిగాయి. స్వామి వారికి అభిషేకాల అనంతరం 300 రకాల వివిధ పుష్పాలతో అలంకరించిన తీరు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదట సప్త గోపూజను చేశారు. 108 మంది చిన్నారులు శ్రీకృష్ణుడు వేషధారణలో అలరించారు. కృష్ణ కోటి, తదితర కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి.