నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

ములుగు జిల్లా కలెక్టరేట్లో సోమవారం రోజున నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో రెడ్ అలర్ట్ ఉన్నందున జిల్లాస్థాయి అధికారులందరూ ప్రత్యేక అధికారులుగా నియమించబడడంతో ప్రజల అసౌకర్యం కలగొద్దని ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.