సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

KRD: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ మోడల్ స్కూల్ విద్యార్థులకు కళాబృందం, షీ టీంతో కలిసి ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. సైబర్ నేరాలు, మోసాల పట్ల విద్యార్థులకు కళాబృందంతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కళాబృందం, పోలీసులు, తదితరులు ఉన్నారు.