VIDEO: ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆప్కాబ్ ఛైర్మన్
ELR: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేసిన కృషి అమోఘమని ఆప్కాబ్ ఛైర్మన్ వీరాంజనేయులు అన్నారు. ఇవాళ నారాయణపురం సొసైటీ వద్ద ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ కడియాల రవిశంకర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.