విద్యార్థుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్
AP: మార్చి నెల ఒకటో తేదీ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బోధనా సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నందున, ఈ విద్యాసంవత్సరం ముగిసేలోపు తుది డేటా సేకరించే అవకాశం ఉంది.