స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
SRD: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జహీరాబాద్‌లోని ఓ స్కూల్ బస్సులో ఇవాళ ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. గమనించిన బస్ డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సులో ఉన్న 36 మంది విద్యార్థులను కిందకు దించాడు. స్థానికుల సహాయంతో మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బ్యాటరీలో చెలరేగిన మంటల ద్వారా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.