'నానో యురియాతో రైతులకు ప్రయోజనాలు'

MDK: నానో యూరియాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ అన్నారు. రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో నానో యూరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీధర్ రావు అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ పరికరం ద్వారా నానో యూరియా పిచికారి చేశారు. నానో యూరియా ద్వారా అధిక దిగుబడి వస్తుందని సమయం, డబ్బు, ఆదా అవుతుందని తెలిపారు.