హిమాయత్ సాగర్‌లో యువకుడు ఆత్మహత్య

HYD: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువకుడు హిమాయత్ సాగర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారాన్ని అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడిని ముఖేష్‌గా గుర్తించారు.