కొండగట్టు ఆలయంలో అపశ్రుతి

కొండగట్టు ఆలయంలో అపశ్రుతి

TG: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశ్రుతి చోటుచోసుకుంది. హనుమాన్ విజయోత్సవ దినం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.