శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులు

SRD: కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. మే డే సందర్భంగా సంగారెడ్డిలో బహిరంగ సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల తమ హక్కుల కోసం పోరాటం చేయడం వల్లే మే డే వచ్చిందని చెప్పారు. కార్మిక చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సభలో నాయకులు పాల్గొన్నారు.