'మహిళా సంఘాలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'
TPT: తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో పర్యాటక శాఖ, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు హోమ్ స్టే అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. మహిళలు ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 10వేల హోమ్ స్టేలు మహిళల ఆధ్వర్యంలో నడపనున్నట్లు వెల్లడించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు.