దూడపై చిరుత దాడి
MDK: తూప్రాన్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. గుండ్రెడ్డిపల్లి గ్రామంలో చింతల శేఖర్‌కు చెందిన దూడపై సోమవారం రాత్రి చిరుత పులి దాడి చేసింది. గత ఆరు నెలలుగా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులులు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో పొలం వద్ద ఉంచిన దూడపై దాడి చేసి చంపేసినట్లు గ్రామస్తులు వివరించారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.