'వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతోంది'
KDP: వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతోందని తక్షణమే కూటమి ప్రభుత్వం కులాలను పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున కోరారు. సోమవారం కడపలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీలను అందరూ మోసం చేసి ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప వారికి మేలు చేసేలా చర్యలు తీసుకోలేదన్నారు.