రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు: ఎస్పీ
SRD: మునిపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు NHAI అధికారులతో భద్రతపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైవేపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్‌ల గుర్తింపు చేపట్టాలని అధికారులకు సూచించారు. సైన్ బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచనలు, రిఫ్లెక్టర్ల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో NHAI అధికారులు ఫాల్గొన్నారు.