'ఇంటి పన్నును ఫోన్ ద్వారానే చెల్లించండి'
ELR: మీ ఇంటి పన్నును మీ ఫోన్ ద్వారానే చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో గెడ్డం రమేష్ బాబు కోరారు. ఇవాళ ఉంగుటూరు మండలంలో వెల్లమిల్లి, బాదంపూడి,ఉంగుటూరు, గ్రామాలలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను వసూళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి అప్పారావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.