ఈ వ్యక్తి కనిపిస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ

ఈ వ్యక్తి కనిపిస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ

గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారవ్వడం కలకలం రేపింది. రేపల్లె సబ్ జైలు నుంచి అనారోగ్యంతో ఐసీయూకు వచ్చిన నిందితుడు పారిపోయాడు. ఈ ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఆర్ముడ్ పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెండ్ చేశారు. అలాగే, పై ఫోటోలో కనిపిస్తున్న నిందితుడి ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.