కారులో రూ. కోటి 57 లక్షల నగదు స్వాధీనం
KDP: గోపవరం(మం) పీపీ కుంట చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ కారులో రూ. కోటి 57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి నుంచి కడపకు వెళ్తున్న ఈ నగదు, కడప నగరానికి చెందిన బంగారు వ్యాపారికి చెందినదని సమాచారం. నగదుకు సంబంధించిన రసీదులు ఉన్నాయని, దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు.