జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు

KDP: సీఐ మోహన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకోకుండా వాహనదారులకు అవగాహన కల్పిస్తూ పోలీసులు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం కడప - కర్నూల్ జాతీయ రహదారిపై పలు ప్రాంతాలలో సెల్ఫోన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనదారులు అప్రమత్తతో వాహనాలు నడపాలని సూచించారు.