అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

BHNG: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని ఇవాళ కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రంలో ఆహార నాణ్యత, పరిశుభ్రతను తనిఖీ చేసి, ప్రభుత్వం మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి వారి ప్రతిభను ప్రోత్సహించారు.