'యువత సరైన మార్గంలో ప్రయాణించాలి'

'యువత సరైన మార్గంలో ప్రయాణించాలి'

JN: యువత బెట్టింగ్లకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో ప్రయాణించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బుధవారం బహుమతులను అందించారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.