అదనపు కలెక్టర్‌ను కలిసిన ఛైర్‌పర్సన్
BHNG: ఆలేరు మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావుని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రసాదాన్నీ అందించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధికి జిల్లా అదనపు కలెక్టర్ తమ సహాయ సహకారాలు అందించాలని ఆయనను కోరారు.