నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు
AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం మేజర్ పంచాయతీలో వేసవిలో నీటి సమస్యలు రాకుండా సర్పంచ్ లోచల సుజాత ముందస్తు చర్యలు చేపట్టారు. పంచాయతీ బోర్‌వెల్‌కు అనుసంధానంగా 20 వేల లీటర్ల నీటి ట్యాంక్‌కు మరమ్మతులు చేసి గురువారం ప్రారంభించారు. దీని ద్వారా ఆరు వీధులకు తాగునీరు అందుతుందని, జెజెఎమ్ స్కీమ్‌లో అంతరాయం వచ్చినా ఈ ట్యాంక్ ఉపయోగపడుతుందని తెలిపారు.