ఈ నెల 16 నుంచి ఫిరంగిపురంలో గాలికుంటు టీకాలు
GNTR: పశువుల్లో వ్యాపించే గాలికుంటు (ఫుట్ అండ్ మౌత్) వ్యాధి నివారణ కోసం ఫిరంగిపురంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 29 వరకు ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు పశువైద్యాధికారి డా. షేక్ పీర్ అహ్మద్ తెలిపారు. కాబట్టి మండలంలోని రైతులు ఈ విషయాన్ని గమనించి తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు.