అధికారుల నిర్లక్ష్యం.. చౌరస్తాలో పశువులు

అధికారుల నిర్లక్ష్యం.. చౌరస్తాలో పశువులు

PDPL: మంథనిలోని ప్రధాన అంబేద్కర్ చౌరస్తాలో పశువులు తిరుగుతుండడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రద్దీ ప్రాంతంలో పశువులు గుమిగూడడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. అధికారులు పట్టించుకోవాలని కోరారు.