VIDEO: చికెన్ అవుట్ లెట్ వద్ద ఉద్రిక్తత

VIDEO: చికెన్ అవుట్ లెట్ వద్ద ఉద్రిక్తత

HYD: రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్‌ల బంద్ నేపథ్యంలో ఎల్బీనగర్‌లోని ఓ చికెన్ అవుట్ లెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చికెన్ సెంటర్ బంద్ నేపథ్యంలో ఓ చికెన్ అవుట్ లెట్ తెరిచి ఉండటంతో అవుట్ లెట్ యజమానికి అసోసియేషన్ షాపులకి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అవుట్ లెట్‌లో ఉన్న గుడ్ల ట్రేలను బయట పడేసి అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.