వర్ష ప్రభావంతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

BDK: మణుగూరులో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కారణంగా మణుగూరు సింగరేణి ఉపరితల గనుల్లో ఆదివారం బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఒక గంటలో 16 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. వర్ష ప్రభావానికి సింగరేణి బొగ్గు ఉత్పత్తి తో పాటు మట్టి తోలిచే పనులకు ఆటంకం ఏర్పడింది. ఉపరిత గనుల్లో నీరును మోటార్ల సహాయంతో అధికారులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.