ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

BDK: భద్రాచలం పట్టణంలోని రామాలయం స్టేడియం వెనుక వీధిలో శుక్రవారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే రామాలయం స్టేడియం వెనుక బజారుకు చెందిన ప్రభ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ఓ లాడ్జిలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.