'నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం'

'నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం'

NTR: చందర్లపాడు మండలంలోని చింతలపాడు గ్రామంలో వరి, పత్తి పంటలు పడవ్వగా, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం గౌరవంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.