కల్లు మానేయడంతో 10 మందికి అస్వస్థత.!
సత్యసాయి: హిందూపురం పట్టణంలో ఒక్కసారిగా కల్లు తాగడం మానేయడంతో 10 మంది వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వారిని స్థానిక ప్రైవేట్ క్లినిక్‌కు తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలు మాట్లాడుతూ.. ఆకస్మికంగా కల్లు మానడం వల్ల మానసిక అస్థిరత ఏర్పడిందని తెలిపారు.