మంత్రి పర్యటన వివరాలు..!
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ చిన్నమండ మండలంలో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్ల పనుల భూమి పూజ కార్యక్రమాలు చేసి ప్రజల సమస్యలను విని తక్షణమే పరిష్కరిస్తారని ఒక్క ప్రకటన ద్వారా తెలిపారు. ఈ పర్యటనలో కార్యకర్తలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.