ఏడాది తరువాత తల్లిదండ్రుల చెంతకు.!
ATP: ఏడాది క్రితం తప్పిపోయిన యువకుడి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ వెంకటరమణ శనివారం తెలిపారు. గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామానికి చెందిన ఆంజనేయులు ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో గుమ్మగట్ట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగి బాలుడి ఆచూకీ కనుగొన్నారు.