'వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించండి'
CTR: ఐరాల మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రజల సమస్యలు తెలుసుకొని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించమని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐరాల తవణంపల్లి మండల అధ్యక్షులు హరిబాబు నాయుడు, వెంకటేష్ చౌదరి, కాణిపాకం ఆలయం బోర్డ్ ఛైర్మన్ మణినాయుడు పాల్గొన్నారు.