ఆశిరెడ్డిపల్లిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన
BHPL: టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి జక్కుల కుమారస్వామి గ్రామ పంచాయతీ వద్ద ఫ్లెక్సీ పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ ప్రచారం పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనను ఉల్లంఘించిన అభ్యర్థిని ఎన్నికల నుండి తొలగించాలని ప్రత్యర్థులు ఎన్నికల అధికారులను కోరారు.