VIDEO: 'కోటి సంతకాల సేకరణకు మంచి స్పందన'
SKLM: వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం పోలాకి మండల కేంద్రంలో మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్ణయంతో యువతకు నష్టం జరుగుతుందన్నారు.