రైల్వే సిబ్బందిని అడ్డుకున్న ఎమ్మెల్యే నాని
TPT: చంద్రగిరి మండలం కొంగరవారిపల్లిలో రైల్వే భూమిపై అక్రమ కట్టడాల తొలగింపు కోసం రైల్వే అధికారులు ప్రయత్నించగా, ఎమ్మెల్యే పులివర్తి నాని చేరుకుని పనులు నిలిపివేశారు. ఇందులో భాగంగా ఆయన గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని, ఆయన విషయాన్ని కలెక్టర్‌కు తెలిపారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.