'పాక్‌కు మద్ధతు తెలిపిన వారు దేశ ద్రోహులు'

'పాక్‌కు మద్ధతు తెలిపిన వారు దేశ ద్రోహులు'

పాకిస్తాన్‌కు మద్ధతు తెలిపిన వారు దేశ ద్రోహులవుతారని అస్సాం CM హిమంత బిశ్వశర్మ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రాష్ట్రంలో పాక్‌కు మద్ధతు తెలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే 42 మందిని అరెస్టు చేశామని, ఇవాళ బర్పెటా జిల్లాలో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఎం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని అన్నారు.