అక్రమ ఇసుక నిల్వలపై పోలీసుల దాడి

అక్రమ ఇసుక నిల్వలపై పోలీసుల దాడి

MDK: నార్సింగి మండలంలో అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున నిల్వ ఉంచిన ఇసుక డంపుల గురించి రైతులు గురువారం 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఎలాంటి పర్మిట్లు లేకుండా నిల్వ చేయబడిన సుమారు 15 ట్రాక్టర్ల ఇసుక డంపులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.