'స్పిరిట్' షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్

'స్పిరిట్' షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్

'బాహుబలి: ది ఎపిక్' మూవీ జపాన్‌లో ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్‌కు వెళ్లాడు. అక్కడ రేపు, ఎల్లుండి జరిగే ప్రీమియర్స్‌కు హాజరుకానున్నాడు. ఇందుకోసం ఇటీవల ప్రారంభమైన 'స్పిరిట్' మూవీ షూటింగ్‌కు ప్రభాస్ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు. ఇక 'స్పిరిట్' మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు.