గోదావరిలో రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరిలో రెండో ప్రమాద హెచ్చరిక

ములుగు: జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. జిల్లాలో 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 75 కుటుంబాలకు చెందిన 216 మందిని తరలించారు. నదీ తీర ప్రాంతాలకు వెళ్లరాదని, వరద నీటిలో ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు.