గిద్దలూరులో నేడు ప్రజాదర్బార్
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్భార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని అర్జీలను స్వీకరించనున్నారు. గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయవచ్చని ఆయన పేర్కొన్నారు.