SRSP UPDATE: 39 గేట్లు ఓపెన్

NZB: భారీ వర్షాల కారణంగా SRSPకి వరద నీరు పోటెత్తడంతో బుధవారం రాత్రి 8 గంటలకు మొత్తం 39 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఉదయం 10 గంటలకు 8 గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా మొత్తం 39 గేట్లు, ఇతర కాలువల ద్వారా మొత్తం 1,71,048 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.