'గ్రామ అభివృద్ధి రూ. 10 లక్షలు ఇస్తాం'
MNCL: దండేపల్లి మండలంలోని నంబాల గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షల నిధులు అందిస్తానని బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ఆదివారం నంబాలలో బీజెపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. బీజెపీ మద్దతుదారుడు రాయమల్లును గెలిపిస్తే రూ. 10 లక్షలు గ్రామ అభివృద్ధికి ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజెపీ నాయకులు ఉన్నారు.