విషాదం.. గోడ కూలి బాలుడు మృతి

విషాదం.. గోడ కూలి బాలుడు మృతి

PPM: కొమరాడ మండలం అర్తాంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అకాల వర్షాలకు బాత్‌రూమ్‌ గోడ పూర్తిగా నానిపోయి కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న హేమంత్ (8) అనే బాలుడిపై గోడ పడి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.